Sunday, September 23, 2012

AP GAP: Akkineni Nageswara Rao Auto Bio Graphy and Filmography

AP GAP
Akkineni Nageswara Rao Auto Bio Graphy and Filmography
Sep 23rd 2012, 08:03

Akkineni Nageswara Rao Auto Bio Graphy and Filmography

 

Name : పద్మభూషణ్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు

Other Names: ఏ.యన్.ఆర్, నటసామ్రాట్

Date of Birth: 20 సెప్టెంబర్  1924

Father : అక్కినేని వెంకటరత్నం

Wife : అన్నపూర్ణ

Sons : వెంకట్, నాగార్జున

Daughters: శ్రీమతి సత్యవతి, శ్రీమతి నాగ సుశీల, శ్రీమతి సరోజ

Relatives: సుమంత్ (మనుమడు)

   సుశాంత్ (మనుమడు)

           

   నాగ చైతన్య  (మనుమడు)

           

   అఖిల్  (మనుమడు)

         

     అమల (కోడలు )

 Akkineni Nageswara Rao Family Photo :

 

అక్కినేని అప్పటి మద్రాసు రాష్ట్రములోని  కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా వెంకటరాఘవాపురం అనే గ్రామంలో పేద వ్యవసాయకుటుంబంలో జన్మించారు. ప్రాధమిక విద్యతోనే చదువుకు ఆటంకం ఏర్పడింది. కుటుంబ ఆర్దిక పరిస్థితుల దృష్ట్యా 9 సంవత్సరాల ప్రాయంలోనే నటనను వృత్తిగా స్వీకరించి ఎన్నో నాటకాలలో నటించారు. అప్పటి నాటకాల్లో మగవారే అడవేషాల్లో కూడా నటించేవారు. అలా తన కళారంగ ప్రారంభదశలో స్త్రీపాత్రల్లో అలరించారు. తరవాత 1941 లో ‘ధర్మపత్ని’ సినిమాతో అక్కినేని సినీప్రస్థానం మొదలయింది. ఆ సినిమాలో హీరో చిన్ననాటి స్నేహితుని పాత్రలో నటించారు. ఒకానొక సందర్భంలో ఘంటసాల బలరామయ్య దృష్టిలోపడి ‘సీత రామ జననం ‘ చిత్రంలో రాముడుగా నటించటంతో అక్కినేనికి బ్రేక్ దొరికింది. అక్కడినుంచి 69 సంవత్సరాల సుదీర్ఘ  కాలంపాటు 258 చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. తోలి లవర్ బాయ్ గా, రొమాంటిక్ హీరోగా, మొట్టమొదటి డ్యాన్సింగ్ హీరోగా అక్కినేనిది తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం. జానపద, పౌరాణిక చిత్రాలలో నటించినప్పటికీ సాంఘిక, కుటుంబకధా చిత్రాల నాయకుడిగా ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు.

 

అక్కినేని నటజీవితంలో అజరామరమైన చిత్రాలు ఎన్నో తెనాలి రామకృష్ణ, కాళిదాసు, మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మ కధ, ప్రేమనగర్, ప్రేమాభిషేకం, మేఘసందేశం వాటిలో మచ్చుకకు కొన్ని. అన్నపూర్ణ స్టూడియోస్ ను నిర్మించి మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగు సినీపరిశ్రమను హైదరాబాద్ కు తీసుకురావటంలో కీలకపాత్ర పోషించారు అక్కినేని.

 

అక్కినేని నాగేశ్వరరావు సినిమా రంగానికి చేసిన కృషికి గాను …  వచ్చిన  Awards:

Civilian honors :

పురస్కారాలు

1. విశిష్ట వ్యక్తి అవార్డు – 10.03.1988 – సాహితి సాంస్కృతిక సంస్థ, తెనాలి.
2. రాజ్ కపూర్ స్మారక అవార్డు – 10.06.1989 – కిన్నెర ఆర్ట్ థియేటర్స్, హైదరాబాద్.
3. రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు – 10.03.1980 – ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
4. పద్మ భూషణ్ – 1988 – భారత ప్రభుత్వం.
5. కాలిదాస్ సమ్మాన్ ఆవార్ద్ — మధ్య ప్రదేష్ ప్రభుత్వం
6. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు – 07.04.1991 – ఆర్. వెంకట్రామన్, భారత రాష్ట్రపతి, కొత్త ఢిల్లీ.
7. లైఫ్ టెమ్ అఛీవ్ మెంట్ అవార్డు – 21.10.1994 – కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్, పిట్స్ బర్గ్.
8. అన్నా అవార్డు – 24.11.1995 – జయలలిత, తమిళనాడు ముఖ్యమంత్రి, చెన్నై.
9. పద్మశ్రీ – 1971 భారత ప్రభుత్వం
10. యన్టీయార్ జాతీయ పురస్కారమ్

దక్షిణ భారత హిందీ ప్రఛార సభ మద్రాసు వారిఛే డాక్టర్ ఆఫ్ లెటర్స్ అవార్డ్ ఇవ్వబడింది
బిరుదులు

నటసమ్రాట్
కళాప్రపూర్ణ (గౌరవ డాక్టరేట్)
మహా నటుడు

అవార్డులు ఎన్నో ఫిలింఫేర్, నంది, కళాసాగర్, వంశీ అవార్డులే కాక ఈ క్రింది పురస్కారాలు కూడా ఆయన అందుకున్నారు.

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (భారత ప్రభుత్వం)
కాళిదాస్ సమ్మాన్ (మధ్య ప్రదేశ్ ప్రభుత్వం)
ఎన్ టి ఆర్ అవార్డు (ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం)
రఘుపతి వెంకయ్య అవార్డు (ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం)
పద్మవిభూషన్(భారత ప్రభుత్వమ్)

Life Time Achivement Award (2012) by USA Telugu People

నటించిన సినిమాలు
క్రమ సంఖ్య     విడుదల తేది     సినిమా పేరు     దర్శకత్వం     కథానాయిక(లు)
1                   10/1/1941     ధర్మపత్ని        పి.పుల్లయ్య
2                    7/12/1944     సీతారామ జననం     ఘంటసాల బలరామయ్య
3                    10/10/1945     మాయలోకం     గూడవల్లి రామబ్రహ్మం     ఎస్.వరలక్ష్మి
4                    2/1/1946     రత్నమాల     పి.రామకృష్ణ     భానుమతి
5                    1/8/1946     ముగ్గురు మరాఠీలు     ఘంటసాల బలరామయ్య     టి.జి.కమలాదేవి
6                   24/09/1947     పల్నాటి యుద్ధం     గూడవల్లి రామబ్రహ్మం, ఎల్.వి.ప్రసాద్     ఎస్.వరలక్ష్మి
7                  28/02/1948     బాలరాజు     ఘంటసాల బలరామయ్య     ఎస్. వరలక్ష్మి
8                 19/02/1949     కీలుగుర్రం     మీర్జాపురం రాజా
9                  30/04/1949     రక్ష రేఖ     ఆర్. పద్మనాభన్     అంజలీదేవి, భానుమతి
10             1/10/1949     లైలా మజ్ఞు     పి. రామక్రిష్ణ     భానుమతి
11               28/02/1950     శ్రీలక్ష్మమ్మ కథ     ఘంటసాల బలరామయ్య     అంజలీదేవి
12              27/04/1950     పల్లెటూరి పిల్ల     బి.ఎ.సుబ్బారావు     అంజలీదేవి
13             6/10/1950     పరమానందయ్య శిష్యుల కథ     కస్తూరి శివరావు     గిరిజ
14             10/11/1950     స్వప్న సుందరి     ఘంటసాల బలరామయ్య     అంజలీదేవి, జి.వరలక్ష్మి
15            29/12/1950     సంసారం     ఎల్.వి.ప్రసాద్     లక్ష్మీరాజ్యం
16           16/02/1951     మయమలై (తమిళం)     మీర్జాపురం రాజా     అంజలీదేవి
17            16/02/1951     తిలోత్తమ     మీర్జాపురం రాజా
18            14/06/1951     మాయలమారి     పి. శ్రీధర్     అంజలీదేవి
19            21/08/1951     స్త్రీ సాహసం (తమిళం)     వేదాంతం రాఘవయ్య
20            9/8/1951     స్త్రీ సాహసం     వేదాంతం రాఘవయ్య
21            11/4/1951     ఒరే ఇరువు (తమిళం)     పి. నీలకంఠన్
22            11/4/1951     సౌదామిని     కె.బి.నాగభూషణం
23            11/4/1951     సౌదామిని (తమిళం)     కె.బి. నాగభూషణం
24            11/9/1951     మంత్రదండం     కె. రామచంద్ర రావు
25            4/12/1951     మాయకారి (తమిళం)     పి. శ్రీధర్
26           21/03/1952     ప్రేమ     పి. రామక్రిష్ణ     భానుమతి
27           14/06/1952     కాదల్ (తమిళం)     పి. రామక్రిష్ణ     భానుమతి
28            14/01/1953     పరదేశి     ఎల్.వి. ప్రసాద్
29            15/01/1953     పెన్న్మనం (తమిళం)     ఎస్. సౌందరాజన్
30            1/2/1953     పుంగోరై (తమిళం)     ఎల్.వి. ప్రసాద్
31             6/2/1953     బ్రతుకుతెరువు     పి. రామకృష్ణ     శ్రీరంజని, సావిత్రి
32            16/04/1953     కన్నతల్లి     కె.యస్.ప్రకాశరావు     కృష్ణకుమారి
33            15/05/1953     పెట్రతాయ్ (తమిళ్)     కె.యస్.ప్రకాశరావు.
34            6/6/1953     వయ్యారిభామ     పి. సుబ్బారావు
35             26/06/1953     దేవదాసు     వేదాంతం రాఘవయ్య     సావిత్రి
36           11/9/1953     దేవదాసు (తమిళం)     వేదాంతం రాఘవయ్య     సావిత్రి
37           1/1/1954     పూజాఫలం     బి.యన్.రెడ్డి     సావిత్రి, జమున
38           2/3/1954     నిరుపేదలు     తాతినేని ప్రకాశరావు
39            19/03/1954     ఛక్రపాణి     పి. రామకృష్ణ
40              1/9/1954     పరివర్తన     తాతినేని ప్రకాశరావు
41                10/12/1954     విప్రనారాయణ     పి. రామకృష్ణ     భానుమతి
42           17/12/1954     అన్నదాత     వేదాంతం రాఘవయ్య
43            1/10/1955     దొంగ రాముడు     కె.వి. రెడ్డి     సావిత్రి
44             12/1/1955     మిస్సమ్మ     ఎల్.వి. ప్రసాద్     జమున
45             26/01/1955     అర్ధాంగి     పి. పుల్లయ్య     సావిత్రి
46           28/04/1955     అనార్కలి     వేదాంతం రాఘవయ్య     అంజలి దేవి
47             5/8/1955     సంతానం     సి.వి. రంగనాధ దాస్     సావిత్రి
48              9/8/1955     వదిన     యం.వి. రామన్     పండరీభాయి
49     12/1/1956     తెనాలి రామకృష్ణ     బి.యస్. రంగా     జమున
50     6/4/1956     భలే రాముడు     వేదాంతం రాఘవయ్య     సావిత్రి
51     21/06/1956     ఇలవేల్పు     డి. యోగానంద్     అంజలి దేవి
52     20/12/1956     చరణదాసి     తాతినేని ప్రకాశరావు     సావిత్రి
53     21/12/1956     మదర్ కుల మాణిక్యం (తమిళ్)     తాతినేని ప్రకాశరావు
54     11/1/1957     తోడికోడళ్ళు     ఆదుర్తి సుబ్బారావు     సావిత్రి
55     12/1/1957     సతీ సావిత్రి     కె.బి. నాగభూషణం     యస్. వరలక్ష్మి
56     1/2/1957     ఎంగ వీట్టు మహలక్ష్మి (తమిళ్)     ఆదుర్తి సుబ్బారావు     సావిత్రి
57     27/03/1957     మాయాబజార్     కె.వి. రెడ్డి     సావిత్రి
58     29/03/1957     అల్లావుద్దీన్(తమిళం)     టి.ఆర్. రఘునాథ్
59     13/04/1957     అల్లావుద్దీన్     టి. ఆర్. రఘునాథ్
60     19/07/1957     దొంగల్లో దొర     చెంగయ్య     జమున
61     20/02/1958     భూకైలాస్     కె. శంకర్     —
62     20/05/1958     చెంచులక్ష్మి (తమిళం)     బి.ఎ. సుబ్బారావు     అంజలీ దేవి
63     21/06/1958     కలిమిలేములు     గుత్తా రామినీడు
64     6/8/1958     ఆడపెత్తనం     ఆదుర్తి సుబ్బారావు
65     7/11/1958     సువర్ణ సుందరి (హిందీ)     వేదాంతం రాఘవయ్య     అంజలి దేవి
66     9/4/1958     చెంచులక్ష్మి     బి.ఎ. సుబ్బారావు     అంజలి దేవి
67     12/6/1958     కృష్ణమాయ     సి.యస్. రావు
68     14/01/1959     మంజుల్ మహిమయ్ (తమిళ్)     ఆదుర్తి సుబ్బారావు     సావిత్రి
69     9/4/1959     జయభేరి     పి. పుల్లయ్య     అంజలి దేవి
70     9/4/1959     కళ్యాణ పరిసు (తమిళ్)     సి.వి. శ్రీధర్     బి. సరోజాదేవి
71     1/5/1959     ఇల్లరికం     ప్రత్యగాత్మ     జమున
72     5/6/1959     కళైవన్నన్ (తమిళ్)     సి. పుల్లయ్య
73     6/8/1959     అతిశయ పెణ్ (తమిళ్)     యం.వి. రామన్
74     4/9/1959     నాళక్కై ఒప్పందం (తమిళ్)     కె.వి. రెడ్డి
75     30/10/1959     దైవమే తునై (తమిళ్)     సి.హెచ్.నారాయణమూర్తి
76     17/12/1959     పెళ్ళి సందడి     డి. యోగానంద్     అంజలి దేవి
77     7/1/1960     నమ్మినబంటు     ఆదుర్తి సుబ్బారావు     సావిత్రి
78     27/01/1960     అన్బుమగన్ (తమిళ్)     తాతినేని ప్రకాశరావు
79     19/02/1960     పట్టలియన్ వేట్రై (తమిళ్)     ఆదుర్తి సుబ్బారావు
80     2/4/1960     మహాకవి కాళిదాసు     కమలాకర కామేశ్వరరావు     శ్రీరంజని
81     29/04/1960     పెళ్ళికానుక     సి.వి.శ్రీధర్     బి.సరోజాదేవి, కృష్ణకుమారి
82     7/12/1960     రుణానుబంధం     వేదాంతం రాఘవయ్య     అంజలిదేవి
83     8/7/1960     ఎంగళ్ సెలవై (తమిళ్)     డి.యోగానంద్
84     26/08/1960     అభిమానం     సి.యస్.రావు     సావిత్రి
85     22/12/1960     మా బాబు     తాతినేని ప్రకాశరావు
86     7/1/1961     వెలుగు నీడలు     ఆదుర్తి సుబ్బారావు     సావిత్రి, గిరిజ
87     14/01/1961     తుయి ఉల్లం (తమిళ్)     ఆదుర్తి సుబ్బారావు     సావిత్రి
88     31/03/1961     భార్యా భర్తలు     ప్రత్యగాత్మ     కృష్ణకుమారి
89     7/4/1961     భక్త జయదేవ     పి.వి.రామారావు     అంజలీదేవి
90     30/06/1961     బాటసారి     పి.రామకృష్ణ     భానుమతి
91     21/07/1961     కనాళ నీర్ (తమిళ్)     పి.రామకృష్ణ     భానుమతి
92     5/10/1961     వాగ్ధానం     ఆత్రేయ     కృష్ణకుమారి
93     29/12/1961     ముగ్గురు మరాఠీలు     ఆదుర్తి సుబ్బారావు     రాజ సులోచన, బి.వి.సరోజ
94     16/02/1962     ఆరాధన     వి.మదుసూధనరావు     సావిత్రి
95     11/4/1962     మంచిమనసులు     ఆదుర్తి సుబ్బారావు     సావిత్రి
96     7/6/1962     గుండమ్మ కథ     కమలాకర కామేశ్వరరావు     జమున
97     24/08/1962     కులగోత్రాలు     ప్రత్యగాత్మ     కృష్ణకుమారి
98     8/9/1962     మీండమ్ మరవిల్లై (తమిళ్)     కమలాకర కామేశ్వరరావు
99     19/09/1962     సిరిసంపదలు     పి.పుల్లయ్య     సావిత్రి
100     12/2/1963     ఊరంతా సంక్రాంతి     దాసరి నారాయణరావు
101     10/4/1963     చదువుకున్న అమ్మాయిలు     ఆదుర్తి సుబ్బారావు     కృష్ణకుమారి
102     29/08/1963     పునర్జన్మ     ప్రత్యగాత్మ     కృష్ణకుమారి
103     9/1/1964     ఆత్మబలం     వి.మధుసూదనరావు     బి.సరోజాదేవి
104     30/01/1964     మూగ మనసులు     ఆదుర్తి సుబ్బారావు     సావిత్రి,జమున
105     14/02/1964     మురళీకృష్ణ     పి.పుల్లయ్య     జమున
106     27/03/1964     అమరశిల్పి జక్కన్న     బి.యస్.రంగా     బి.సరోజాదేవి
107     10/7/1964     డాక్టర్ చక్రవర్తి     ఆదుర్తి సుబ్బారావు     కృష్ణ కుమారి
108     1/1/1965     సుమంగళి     ఆదుర్తి సుబ్బారావు     సావిత్రి
109     14/04/1965     రోజులు మారాయి     తాపీ చాణక్య     షావుకారు జానకి
110     27/05/1965     అంతస్తులు     వి.మధుసూదనరావు     జయలలిత
111     24/08/1965     ప్రేమించి చూడు     పి.పుల్లయ్య     కాంచన
112     3/9/1965     మనసులు-మమతలు     ప్రత్యగాత్మ     సావిత్రి, జయలలిత
113     7/1/1966     జమిందార్     వి.మధుసూదనరావు     కృష్ణకుమారి
114     18/03/1966     ఆత్మగౌరవం     కె.విశ్వనాథ్     కాంచన
115     22/04/1966     నవరాత్రి     తాతినేని రామారావు     సావిత్రి
116     6/10/1966     మనసే మందిరం     సి.వి.శ్రీధర్     సావిత్రి
117     18/11/1966     ఆస్తిపరులు     వి.మధుసూదనరావు     జయలలిత
118     7/4/1967     గృహలక్ష్మి     పి.రామకృష్ణ     భానుమతి
119     1/5/1967     సువర్ణసుందరి     వేధాంతం రాఘవయ్య     అంజలిదేవి
120     6/5/1967     ప్రాణమిత్రులు     పి.పుల్లయ్య     సావిత్రి
121     10/8/1967     వసంతసేన     బి.యస్.రంగా
122     10/11/1967     రహస్యం     వేదాంతం రాఘవయ్య     కృష్ణకుమారి
123     24/11/1967     పూలరంగడు     ఆదుర్తి సుబ్బారావు     జమున
124     7/1/1968     మాంగల్యబలం     ఆదుర్తి సుబ్బారావు     సావిత్రి
125     9/1/1968     శ్రీకృష్ణార్జున యుద్ధం     కె.వి.రెడ్డి     బి.సరోజాదేవి
126     1/2/1968     బ్రహ్మచారి     తాతినేని రామారావు     జయలలిత
127     15/03/1968     మంచికుటుంభం     వి.మధుసూధనరావు
128     19/04/1968     గోవులగోపన్న     సి.వి.రావు     భారతి,రాజశ్రీ
129     22/08/1968     బంగారు గాజులు     సి.యస్.రావు     భారతి
130     28/08/1968     సుడిగుండాలు     ఆదుర్తి సుబ్బారావు     —
131     3/1/1969     అదృష్టవంతులు     వి.మధుసూదనరావు     జయలలిత
132     19/02/1969     మూగనోము     డి.యోగానంద్     జమున
133     13/03/1969     బందిపోటు దొంగలు     కె.యస్.ప్రకాశరావు     జమున
134     9/5/1969     ఆదర్శకుటుంబం     ప్రత్యగాత్మ     జయలలిత
135     24/07/1969     ఆత్మీయులు     వి.మధుసూదనరావు     వాణిశ్రీ
136     14/08/1969     భలే రంగడు     తాతినేని రామారావు
137     20/09/1969     బుద్ధిమంతుడు     బాపు     విజయనిర్మల
138     30/10/1969     సిపాయి చిన్నయ్య     జి.వి.ఆర్.శేషగిరిరావు     భారతి
139     1/1/1970     అక్కాచెల్లెలు     ఏ.సంజీవి     షావుకారు జానకి,విజయనిర్మల
140     26/02/1970     జై జవాన్     డి.యోగానంద్     భారతి
141     10/4/1970     మరో ప్రపంచం     ఆదుర్తి సుబ్బారావు
142     8/5/1970     ధర్మదాత     ఏ.సంజీవి     కాంచన
143     2/10/1970     ఇద్దరు అమ్మాయిలు     పుట్టణ కనగళ్     వాణిశ్రీ
144     13/01/1971     దసరా బుల్లోడు     వి.బి.రాజేంద్ర ప్రసాద్     వాణిశ్రీ,చంద్రకళ
145     21/01/1971     మనసు మాంగల్యం     ప్రత్యగాత్మ
146     29/01/1971     సుపుత్రుడు     తాతినేని రామారావు     లక్ష్మి
147     29/02/1971     పవిత్రబంధం     వి.మధుసూధనరావు     వాణిశ్రీ
148     3/6/1971     అమాయకురాలు     వి.మధుసూదనరావు     కాంచన
149     18/07/1971     శ్రీమంతుడు     ప్రత్యగాత్మ     జమున
150     11/8/1971     రంగేళీరాజా     సి.యస్.రావు
151     24/09/1971     ప్రేమనగర్     కె.యస్.ప్రకాశరావు     వాణిశ్రీ
152     14/01/1972     భార్యా బిడ్డలు     తాతినేని రామారావు     కృష్ణకుమారి
153     17/02/1972     రైతుకుటుంబం     వి.మదుసూధనరావు     కాంచన
154     24/03/1972     బీదలపాట్లు     బి.విఠలాచార్య
155     12/5/1972     మంచిరోజులొచ్చాయి     వి.మధుసూధనరావు     కాంచన
156     15/06/1972     దత్తపుత్రుడు     టి.లెనిన్ బాబు     వాణిశ్రీ
157     12/10/1972     విచిత్రబంధం     ఆదుర్తి సుబ్బారావు     వాణిశ్రీ
158     22/12/1972     కొడుకు కోడలు     పి.పుల్లయ్య     వాణిశ్రీ,లక్ష్మి
159     15/03/1973     బంగారు బాబు     వి.బి.రాజేంద్రప్రసాద్     వాణిశ్రీ
160     11/5/1973     కన్నకొడుకు     వి.మధుసూదనరావు     కాంచన
161     6/7/1973     భక్తతుకారాం     వి.మధుసూదనరావు     అంజలీదేవి
162     15/08/1973     పల్లెటూరిబావ     ప్రత్యగాత్మ     లక్ష్మి,శుభ
163     20/09/1973     అందాలరాముడు     బాపు     లత
164     23/11/1973     మరపురాని మనిషి     తాతినేని రామారావు     మంజుల
165     12/1/1974     ప్రేమలు-పెళ్ళిల్లు     వి.మధుసూధనరావు     శారద,జయలలిత
166     21/02/1974     మంచివాడు     వి.మధుసూదనరావు     కాంచన,వాణిశ్రీ
167     21/06/1974     బంగారు కలలు     ఆదుర్తి సుబ్బారావు     లక్ష్మి
168     31/10/1974     దొరబాబు     తాతినేని రామారావు     మంజుల
169     30/03/1976     మహాకవి క్షేత్రయ్య     ఆదుర్తి సుబ్బారావు     మంజుల
170     28/04/1976     సెక్రటరీ     కె.యస్.ప్రకాశరావు     వాణిశ్రీ
171     15/10/1976     మహాత్ముడు     ఎం.ఎస్.గోపీనాధ్
172     3/2/1977     చక్రధారి     వి.మధుసూధనరావు     వాణిశ్రీ, జయప్రద
173     17/03/1977     ఆలుమగలు     తాతినేని రామారావు     వాణిశ్రీ
174     14/04/1977     బంగారు బొమ్మలు     వి.బి.రాజేంద్రప్రసాద్     మంజుల
175     20/07/1977     రాజా రమేష్     వి.మధుసూదనరావు     వాణిశ్రీ
176     25/08/1977     చాణక్య చంద్రగుప్త     ఎన్.టి.రామారావు     —
177     23/11/1977     ఆత్మీయుడు     తాతినేని రామారావు     వాణిశ్రీ
178     11/1/1978     చిలిపి కృష్ణుడు     బోయిన సుబ్బారావు     వాణిశ్రీ
179     23/03/1978     దేవదాసు మళ్ళీపుట్టాడు     దాసరి నారాయణరావు     వాణిశ్రీ, జయప్రద
180     14/04/1978     విచిత్ర జీవితం     వి.మధుసూదనరావు     వాణిశ్రీ
181     8/6/1978     రామకృష్ణులు     వి.బి.రాజేంద్ర ప్రసాద్     జయప్రద
182     2/11/1978     శ్రీరామరక్ష     తాతినేని రామారావు     వాణిశ్రీ
183     16/02/1979     రావణుడే రాముడైతే     దాసరి నారాయణరావు     జయచిత్ర.లత
184     28/03/1979     హేమాహేమీలు     విజయనిర్మల     జరీనా వహాబ్
185     8/6/1979     ముద్దుల కొడుకు     వి.బి.రాజేంద్ర ప్రసాద్     శ్రీదేవి, జయసుధ
186     15/06/1979     అండమాన్ అమ్మాయి     వి.మధుసూదనరావు     వాణిశ్రీ
187     11/1/1980     ఏడంతస్తుల మేడ     దాసరి నారాయణరావు     సుజాత, జయసుధ
188     14/01/1960     శాంతి నివాసం     సి.యస్.రావు     రాజసులోచన
189     1/2/1980     నాయకుడు-వినాయకుడు     ప్రత్యాగాత్మ     జయలలిత
190     21/03/1980     బుచ్చిబాబు     దాసరి నారాయణరావు     జయప్రద
191     29/04/1960     పెళ్ళినాటి ప్రమాణాలు     కె.వి.రెడ్డి     జమున, రాజసులోచన
192     26/09/1980     పిల్ల జమిందార్     సింగీతం శ్రీనివాసరావు     జయసుధ
193     1/1/1981     శ్రీవారి ముచ్చట్లు     దాసరి నారాయణరావు     జయసుధ, జయప్రద
194     18/02/1981     ప్రేమాభిషేకం     దాసరి నారాయణరావు     శ్రీదేవి, జయసుధ
195     28/05/1981     సత్యమ్-శివమ్     కె.రాఘవేంద్రరావు     రతి అగ్నిహోత్రి
196     27/06/1981     ప్రేమ కానుక     కె.రాఘవేంద్రరావు     సుజాత, శ్రీదేవి
197     21/08/1981     గురుశిష్యులు     కె.బాపయ్య     సుజాత
198     24/08/1981     ప్రేమమందిరం     దాసరి నారాయణరావు     జయప్రద
199     8/12/1961     శభాష్ రాజా     రామకృష్ణ     కృష్ణకుమారి
200     11/1/1982     రాగదీపం     దాసరి నారాయణరావు     రాధ, జయసుధ
201     2/4/1982     బంగారు కానుక     వి. మధుసూదనరావు     శ్రీదేవి
202     1/7/1982     గోపాలకృష్ణుడు     ఎ. కోదండరామిరెడ్డి     రాధ, జయసుధ
203     22/08/1982     శ్రీరంగనీతులు     ఎ. కోదండరామిరెడ్డి     శ్రీదేవి
204     24/09/1982     మేఘసందేశం     దాసరి నారాయణరావు     జయసుధ, జయప్రద
205     19/12/1982     యువరాజు     దాసరి నారాయణరావు     సుజాత, జయసుధ
206     4/2/1983     ముద్దుల మొగుడు     టి.యస్.ప్రకాశరావు
207     19/05/1983     బహుదూరపు బాటసారి     దాసరి నారాయణరావు     సుజాత
208     19/08/1983     అమరజీవి     జంధ్యాల     జయప్రద, సుమలత
209     6/1/1984     కోటీశ్వరుడు     కొమ్మినేని శేషగిరిరావు     సుజాత
210     26/01/1984     తాండవ కృష్ణుడు     పి. చంద్రశేఖరరెడ్డి
211     30/03/1984     అనుబంధం     ఎ.కోదండరామిరెడ్డి     రాధిక, సుజాత
212     11/5/1984     యస్.పి. భయంకర్     వి.బి.రాజేంద్రప్రసాద్     శ్రీదేవి
213     24/08/1984     వసంతగీతం     సింగీతం శ్రీనివాసరావు     రాధ
214     20/09/1984     జస్టిస్ చక్రవర్తి     దాసరి నారాయణరావు     సుజాత
215     23/11/1984     సంగీత సామ్రాట్     సింగీతం శ్రీనివాసరావు     జయప్రద
216     28/03/1985     భార్యాభర్తల బంధం     వి.బి. రాజేంద్రప్రసాద్     జయసుధ
217     12/7/1985     దాంపత్యం     ఎ.కోదండరామిరెడ్డి     సుజాత, రాధిక
218     12/9/1985     ఇల్లాలే దేవత     తాతినేని ప్రసాద్     భానుప్రియ, రాధిక
219     20/06/1986     ఆదిదంపతులు     దాసరి నారాయణరావు     జయసుధ
220     14/11/1986     బ్రహ్మరుద్రులు     కె. రాఘవేంద్రరావు     లక్ష్మి
221     25/12/1986     గురుబ్రహ్మ     బోయిన సుబ్బారావు     శారద
222     9/4/1987     కలెక్టరుగారి అబ్బాయి     బి. గోపాల్     శారద
223     27/08/1987     అగ్నిపుత్రుడు     కె. రాఘవేంద్రరావు     శారద
224     1/10/1987     ఆత్మబంధువు     దాసరి నారాయణరావు     జయసుధ
225     14/01/1988     రాజేశ్వరి కళ్యాణం     క్రాంతి కుమార్     వాణిశ్రీ
226     8/6/1988     రావుగారిల్లు     తరణి     జయసుధ, రేవతి
227     14/01/1989     రాజకీయ చదరంగం     పి. చంద్రశేఖర్ రెడ్డి
228     24/02/1989     భలే దంపతులు     కోడి రామకృష్ణ     జయసుధ
229     11/5/1989     సూత్రధారులు     కె.విశ్వనాథ్     సుజాత
230     7/12/1989     ఆదర్శవంతుడు     కోడి రామకృష్ణ
231     12/1/1980     రావుగారింట్లో రౌడీ     కోడి రామకృష్ణ
232     7/9/1990     ఇద్దరూ ఇద్దరే     ఎ. కోదండరామిరెడ్డి     శారద
233     30/11/1990     దాగుడుమూతల దాంపత్యం     రేలంగి నరసింహారావు     జయసుధ
234     11/1/1991     సీతారామయ్యగారి మనుమరాలు     క్రాంతి కుమార్     రోహిణీ హట్టంగడి
235     15/01/1992     ప్రాణదాత     మోహన్ గాంధీ     లక్ష్మి
236     20/02/1992     రగులుతున్న భారతం     అల్లాణి శ్రీధర్
237     16/04/1992     మాధవయ్యగారి మనవడు     ముత్యాల సుబ్బయ్య
238     2/7/1992     కాలేజి బుల్లోడు     శరత్     లక్ష్మి
239     18/02/1994     బంగారు కుటుంబం     దాసరి నారాయణరావు     జయసుధ
240     18/08/1994     గాంఢీవం     ప్రియదర్శన్     శ్రీవిద్య
241     17/10/1994     తీర్పు     ఉప్పలపాటి నారాయణరావు     రోహిణీ హట్టంగడి
242     23/03/1995     గాడ్ ఫాదర్     కోడి రామకృష్ణ
243     2/5/1996     రాముడు కాదు కృష్ణుడు     దాసరి నారాయణరావు     జయసుధ
244     11/5/1996     మాయాబజార్     దాసరి నారాయణరావు
245     12/5/1996     రాయుడుగారు నాయుడుగారు     దాసరి నారాయణరావు     సుజాత
246     16/04/1998     రథసారధి     కోడి రామకృష్ణ     లక్ష్మి
247     1/5/1998     పండగ     శరత్     జయసుధ
248     27/05/1998     మెకానిక్ అల్లుడు     బి. గోపాల్     శారద
249     28/08/1998     సీతారాముల కళ్యాణము చూతము రారండి     వై.వి.యస్. ఛౌదరి
250     3/9/1998     డాడీ డాడీ     కోడి రామకృష్ణ     జయసుధ
251     27/07/2000     పెళ్ళి సంబంధం     కె. రాఘవేంద్రరావు
252     27/12/2000     సకుటుంబ సపరివార సమేతం     యస్.వి.కృష్ణారెడ్డి
253     11/1/2006     చుక్కల్లో చంద్రుదు     శివకుమార్     వాహిదా రెహమాన్
254     2006     శ్రీ రామదాసు     కె. రాఘవేంద్రరావు
255     2011     శ్రీ రామరాజ్యం         —

 

You are receiving this email because you subscribed to this feed at blogtrottr.com.

If you no longer wish to receive these emails, you can unsubscribe from this feed, or manage all your subscriptions

No comments:

Post a Comment

Blog Archive