నగరం లో మల్లి అలజడి గత కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న రాజధాని లో బాంబులు మల్లి పేలాయి ..దిల్ సుక్ నగర్లో బారి పేలుళ్లు సంబవించాయి కోణార్క్ థియేటర్, దాని పక్కన గల ఆనంద్ టిఫిన్ సెంటర్ .పుట్ ఓవర్ బ్రిడ్జి, వేంకటాద్రి థియేటర్ పేలుడు సంబవించింది ఈ పేలుళ్ళలో 7గురు ప్రాణాలు కోల్పోయినట్లు, 50 మంది మరణిచినట్లు ప్రాథమికంగా నిరదరించారు..నగర జనాలు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు….
హైదరాబాద్‌పై టెర్రర్ పంజా : 20 మంది మృతి
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌పై మరోసారి ఉగ్రవాదులు పంజా విసిరారు. ఇవాళ సాయంత్రం నగరంలోని దిల్‌షుక్‌నగర్ బాంబు పేలుళ్లతో రక్తసిక్తమైంది. ఈ ఘటనలో సుమారు 20 మందికిపైగా మరణించి ఉంటారని సమాచారం. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం ఐదు చోట్ల ఈ పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. దిల్‌షుక్‌నగర్ బస్టాండు సమీపంలోని వెంకటాద్రి థియేటర్, కోణార్క్ థియేటర్ సమీపంలోని సమీపంలోని ఆనంద్ టిఫిన్ సెంటర్ వద్ద, ఫుట్‌ఓవర్ బ్రిడ్జీ సమీపంతో పాటు పలు చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. సంఘటనా స్థలం వద్ద మొత్తం మాంసపు ముద్దలతో భయానకంగా మారింది.
పేలుళ్ల ధాటికి రద్దీగా ఉన్న దిల్‌షుక్‌నగర్ బస్టాండు ప్రాంతం క్షణాల్లో అత్యంత దయనీయంగా తయారయింది. ఎంతో మంది క్షతగాత్రులు సహాయం కోసం దీనంగా ఆర్తీస్తున్నట్లు సమాచారం. రక్తపు మడుగులో కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారికి సహాయం అందించడానికి ట్రాఫిక్ జామ్ అడ్డంకిగా మారుతోంది. పేలుళ్ల ధాటికి జనాలు ఒక్క సారిగా పరుగులు తీయడంతో తొక్కిసలాటలో కూడా కొంత మంది గాయపడినట్లు సమాచారం. దిల్‌షుక్‌నగర్ ఏరియా సాయంత్రం పూట అత్యంత రద్దీగా ఉంటుంది. అందుకే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు పేలుడు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.


No comments:
Post a Comment