Barfi Nominated for Oscar Award

ఇటీవల విడుదలైన ‘బర్ఫీ’ హిందీ చిత్రం మన దేశం నుంచి వెళ్లే అధికారిక చిత్రంగా ఆస్కార్ నామినేషన్ పొందింది. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీకి ఈ చిత్రాన్ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని జూరీ చైర్ పర్సన్ మంజూ బోరా మీడియాకు తెలియజేశారు. వివిధ భాషల నుంచి వచ్చిన మొత్తం ఇరవై చిత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ‘బర్ఫీ’ చిత్రాన్ని ఎంపిక చేశామని ఆయన అన్నారు. అనురాగ్ బసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్, ప్రియాంకా చోప్రా, ఇలియానా ప్రధాన పాత్రలు పోషించారు. బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించిన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు సైతం అందుతున్నాయి.
No comments:
Post a Comment