హిందీలోకి ఠాగూర్

గతంలో వచ్చిన ‘ఠాగూర్’ చిత్రాన్ని ఇప్పుడు హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. ఎడిటర్ మోహన్ తనయుడు జయం రవి దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా నటించే ఈ చిత్రంలో కథానాయికగా తమన్నా నటిస్తోంది. ఇప్పటికే ఆమె ‘హిమ్మత్ వాలా’ రీమేక్ లో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

‘షాడో’ సినిమాలో రెండో కథానాయికగా శ్రీకాంత్ పక్కన నటిస్తున్న మధురిమ, మరోపక్క చదువు విషయంలో కూడా బిజీగా వుంది. ప్రస్తుతం తను లా కోర్స్ చదువుతోందట!

ఆమధ్య ‘లవ్ ఫెయిల్యూర్’ చిత్రాన్ని నిర్మించిన కథానాయకుడు సిద్ధార్థ్, త్వరలో మరో చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడు. వచ్చే నెలలో ఆ సినిమాకు సంబంధించిన వివరాలు ప్రకటిస్తానని చెబుతున్నాడు.

మెహర్ రమేష్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న ‘షాడో’ చిత్రం కోసం గణపతి నవరాత్రుల సన్నివేశాలను ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరిస్తున్నారు. ఇందు కోసం 20 అడుగుల గణపతి విగ్రహాన్ని తయారుచేయించారు.
No comments:
Post a Comment