Sunday, September 23, 2012

AP GAP: Krishna Auto Biography – Super Star Krishna

AP GAP
Krishna Auto Biography – Super Star Krishna
Sep 23rd 2012, 06:34

 Krishna Auto Biography – Super Star Krishna

 పేరు  :  ఘట్టమనేని  శివ  రామ  కృష్ణ (కృష్ణ)
జననం :  మే 31, 1943 (వయస్సు 69)
బుర్రిపాలెం , గుంటూరు , మద్రాస్  ప్రెసిడన్సి, బ్రిటిష్  ఇండియా
ఇతర పేర్లు : సూపర్  స్టార్ , నట  శేఖర్
భార్యలు  :
                                                                                                                                                  ఇందిరా దేవి
                                                                 
                                                                                                                                               విజయ నిర్మల -1969
  కొడుకులు :  రమేష్  బాబు -1965,మహేష్  బాబు -1974
 

పద్మావతి -1969

        మంజుల -1970

      ప్రియదర్శిని -1979ఘట్టమనేని  శివ  రామ  కృష్ణ  మే 31, 1943 లొ జన్మించారు. ఈయన కృష్ణ అనే పేరు మీదే బాగా ప్రసిద్ది  చెందారు ,

అంటే   కాకుండా  ఒక నటుడిగా, దర్శకునిగా  మరియు నిర్మాతగా  తెలుగు సినిమా రంగానికి ఎనలేని సేవలు అందించారు. ఈయన దాదాపుగా 350 సినిమాలకు
పైగా  నటించారు , కృష్ణ  ఎంతోమంది దర్శకులని తెలుగు తెరకు పరిచయం చేసారు వారిలో

ఆదుర్తి  సుబ్బా రావు ,

V. మధుసూధనా  రావు ,

K. విశ్వనాధ్ ,

బాపు ,

దాసరి  నారాయణ  రావు ,

                                                                    K. రాఘవేంద్ర రావు……………………… లాంటి ప్రముఖులు చాలామంది ఉన్నారు  . భారతీయ సినీరంగానికి
ఈయన చేసిన సేవలకుగాను 2009 భారత ప్రభుత్వం పద్మ భూషణ్  అవార్డ్ ఇచ్చి గౌరవించింది .

1969  నుండి 1977     

తొలి సారిగా కలర్ సినిమాని(తేనే మనసులు)
తెలుగు సినీరంగానికి అందించింది కృష్ణ గారే, అలాగే

మొదటి స్కోప్ సినిమా (అల్లూరి సీతా రామ రాజు)

మొదటి  70mm సినిమా  (సింహాసనం)

                                              మొదటి  DTS సినిమా (తెలుగు  వీర  లేవరా )
అలాగే కౌబోయ్ మరియు  జేమ్స్ బాండ్ తరహ సినిమాలను కూడా తెలుగు తెరకు పరిచయం చేసి ప్రేక్ష కుల గుండెల్లో ఎనలేని ముద్రని
వేసారు. ఈయన మొత్తం 17 సిమాలకి దర్శకత్వం వహించారు అలాగే తన సొంత ప్రొడక్షన్  పద్మాలయ  ఫిలిం  స్టూడియోలో ఎన్నో సినిమాలను అందించారు .
1989 లో కాంగ్రెస్ పార్టీ తరఫున  మెంబర్ అఫ్ పార్లమెంట్ గా ఎన్నికయ్యారు.
                                                    కృష్ణ తన కెరీర్లో  మొదట్లో  సినిమాలలో చిన్న చిన్న

పదండి ముందుకు

కులగోత్రాలు

                                                                        పరువు  ప్రతిష్ట……………..  వంటి సినిమాలలో వేషాలు వేస్తూ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేస్తూ తొలిసారిగా  తేనె మనసులు
సినిమాలో హీరోగా ఎదిగాడు. అప్పటికే ఆర్ధిక ఒడిదుడుకులు ఎదురుకుంటున్న
                                                                 ఆదుర్తి  సుబ్బారావు……………………….. కృష్ణతో సినిమా రిలీజ్ చెయ్యడానికి చాలా ఇబ్బంది పడ్డాడు కానీ అది విజయం
సాధించడంతో తిరిగి అదే తారాగణంతో   కన్నెమనసులు సినిమా తీసాడు. తర్వాత కృష్ణ హీరోగా సుందర్లాల్  నెహత మరియు డూండీలు
                                                                      గూడచారి 116 …………………………. తీసారు. కన్నెమనసులు బాక్స్ -ఆఫీసు వద్ద ఫెయిల్ అయినా గూడచారి
116 బాగా ఆడి కృష్ణ సినీజీవితానికి గట్టి  పునాదిగా నిలిచింది . అప్పటినుండి కృష్ణ వెనుతిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది.
కృష్ణ యాక్షన్ సినిమాలతో పాటుగా

“మరపురాని కథ”,

“అత్తగారు కొత్త కోడలు” మరియు

“ఉండమ్మ బొట్టుపెడతా” …………………….లాంటి కమర్షియల్ సినిమాలు కూడా చేసారు. అంతే  కాకుండా

N .T .రామారావు,

అక్కినేని నాగేశ్వర రావు…………………….. లాంటి నటులతో

“స్త్రీ జన్మ”,

“నిలువు దోపిడీ”,

“విచిత్ర కుటుంబం”,

“అక్క చెల్లెళ్ళు”……………………….. మరియు

                                                                     “మంచి కుటుంబం”………………………లాంటి చిత్రాలలో నటించాడు. తను చేసే సినిమాలకి గాను నిర్మాతల నుండి
చాల తక్కువ మొత్తంలో డబ్బులు తీసుకోవడం వల్ల చాలామంది కృష్ణ తోనే సినిమాలు తీసేవారు.ఇలా సినిమాలు చేస్తూనే కృష్ణ తన సొంత నిర్మాణ సంస్థని
మొదలు పెట్టారు.తర్వాత ఎన్నో భారి బడ్జట్  సినిమాలు తియ్యటం మొదలు పెట్టారు. వాటిలో ముఖ్యమైనవి

“మోసగాళ్ళకి మోసగాడు”,

“పండంటి కాపురం” ,

“దేవుడు చేసిన మనుషులు”………………. మరియు

                                                           “అల్లూరి సీతారామరాజు ”
అలా ఎన్నో సినిమాలను తీసిన కృష్ణ 1970 వ దశకంలో చాల ఒడిదుడుకులను ఎదుర్కున్నాడు. భారి   బడ్జట్ సినిమాలను తియ్యటం అవి బాక్స్ ఆఫీసు వద్ద
ఆడకపోవటంతో చాల నష్టపోయాడు. 1971 ,72 ,73 లలో తీసిన సినిమాలన్నీబాక్స్ ఆఫీసు వద్ద ఫెయిల్ అవటం మొదలుపెట్టాయి. అది 1974 -75 కి ఇంకా
దారుణమైన పరిస్థితికి వచ్చేసాడు. అప్పుడే ……
                                                                 ” చీకటి వెలుగులు” ……………………..సినిమా తీసాడు.  అతని అభిమానులు సైతం  ఇటువంటిపాత్రలో చూడటానికి
ఇష్టపడలేదు. కానీ అల్లూరి సీతారామరాజు సినిమా తర్వాత పరిస్తితుల్లో మార్పు వచ్చింది కానీ అది NT రామారావు కి కృష్ణకి ఉన్న స్నేహాన్ని దెబ్బతీసింది.
NT రామారావు కృష్ణ ఈ సినిమాలో సరిగ్గా జీవించలేదు అని అన్నారు. ఇక అదే సమయంలో అతను తీసిన దేవదాసు కూడా బాక్స్ ఆఫీసు వద్ద కుదేలు పడటంతో
అందరు ఇక కృష్ణ పని ఐపోయిందని అనుకున్నారు.

1978–1989

కాని  కృష్ణ  త్వరగానే కొల్కుని తన సొంత బ్యానర్ ఫై 1976 లో……………………..

                                                         ‘ పాడి పంటలు ‘……………………………సినిమా తీసాడు అది బాక్స్ ఆఫీసు వద్ద విజయం సాదించడంతో విజయ బ్యానర్
మీద……..
                                                   “శ్రీ రాజ రాజేశ్వరి కాఫీ విలాస్ క్లబ్”……………………  అనే పేరుతో రొండో సినిమా తీసాడు అది కూడా విజయం సాదించడం తో
అదే సంవత్సరం “రామ రాజ్యంలో రక్త పాశం”తీసాడు అదికూడా ఘన విజయం సాదించింది . కానీ ఈ సినిమా పేరు వివాదాస్పదమైంది.
ఇలా సొంత బ్యానర్ లో సినిమాలు చేస్తూనే 1976 లో…………..
                                                                  “కొల్లేటి కాపురం”,
                                                                  “భలే దొంగలు” ……………………..మరియు “దేవుడు గెలిచాడు ” సినిమాలు చేసాడు. వీటిలో “భలే దొంగలు”
తెలుగు సినిపరిశ్రమలో గుర్తుండిపోయే అఖండ విజయం సాదించింది.  ఈ “భలే దొంగలు” సినిమా హిందీ సినిమా ఐన “చోర్ మచాయే షోర్” అనే చిత్రం నుండి
అనువదించినది.
ఇక 1976 లో కృష్ణ……………….
                                                                           “కురుక్షేత్రం”……………………అనే పౌరాణిక సినిమా తీస్తునట్టు ప్రకటించాడు, ఇది విన్న N. T. రామారావు
ఆశ్చర్యానికి లోనయ్యాడు ఎందుకంటే అదే సమయంలో రామారావు
                                                                “దాన వీర సూర కర్ణ”…………………………………. అనే పౌరాణిక సినిమా తీస్తున్నాడు. ఇది వీరిద్దరి మద్య దూరం
మరింతగా పెంచింది. ఇద్దరు శర వేగంగా సినిమా తియ్యడం మొదలుపెట్టారు.రామారావు తక్కువ ఖర్చుతో సినిమాలో ప్రధాన పాత్రలన్నీ తనే వేస్తూ సినిమా
పూర్తి చేసాడు. కృష్ణ మాత్రం భారీ తారాగణం భారీ ఖర్చుతో నిర్మించాడు,ఈ 2 సినిమాలలో రామారావు తీసిన  “దాన వీర సూర కర్ణ” ఘనవిజయం సాదించింది.
ఐనా కృష్ణ మళ్ళి తన విజయ యాత్ర ……………
                                                        “సావాసగాళ్ళు” తో కొనసాగించాడు. కృష్ణ 1978 -1986 లో ఎన్నో విజయాలను చవిచూసాడు.1978 లో కృష్ణ చేసిన…………….
                                                               “అన్నదమ్ముల సవాల్” ఈ సినిమాలో రజిని కాంత్ తమ్మునిగా నటించాడు,అప్పటికి ఇంకా రజిని కాంత్ కి అంట పేరు
రాలేదు .తర్వాత ……..
                                                             “కుమార రాజ” ,
                                                                       “ఏజెంట్ గోపి”
                                                                        “ఇంద్రదనస్సు”
                                                                         “అల్లరి బుల్లోడు” అనే కమర్షియల్ సినిమాలతో హిట్ మీద హిట్ కొట్టాడు.అతని క్రేజ్ ఎంతగా ఉండేదంటే అదే
సంవత్సరం ఫ్లాప్ ఐన…………
                                                           “ముగ్గురు ముగ్గురే “కూడా భారిగా వసూళ్లు చేసింది. 1979 లో యాకంగా 6 సినిమాల్లో విజయం సాదించాడు, వీటిలో……….
                                                              “వియ్యాలవారి కయ్యాలు”,
                                                              “మండే గుండెలు”,
                                                                   “హేమ హేమీలు” మరియు…….
                                                                  “కొత్త  అల్లుడు”   బారి కలెక్షన్స్ వసూలు చేస్తే……….
                                                            “బుర్రిపాలెం బుల్లోడు”…………………….. పెద్ద కమర్షియల్ హిట్ అయ్యింది.
                                                           1980 లో  శ్రీదేవి-కృష్ణ హిట్ జంటగా పేరొందింది. వీరిద్దరూ కలిసి
                                                                         “ఘరానా దొంగ” ,
                                                                   ” మామ అల్లుళ్ళ సవాల్ “,
                                                                  “చుట్టాలున్నారు జాగ్రత్త”
                                                                          “రామ్ రాబర్ట్ రహీం ” సినిమాలు చేసారు.
ఇక 1981 లో  కృష్ణ తన పోటిదారులoదరిని వెనక్కి నెడుతూ……………
                                                                   “ఊరికి మొనగాడు ” ……….. సంక్రాంతి నాడు విడుదల చేసి అనేక రికార్డులని బద్దలు కొట్టించాడు  ….
                                                  1982 లో………….
                                                                 “బంగారు భూమి” తో…………………………… మరో పెద్ద హిట్ సాదించాడు. ఈ సినిమా తను ఇంతకూ ముందు తీసిన
“పాడిపంటలు” సినిమాకి సీక్వల్ గా చప్పవచ్చు. ఎలా అనతికాలంలోనే అతి వేగంగా 200 సినిమాలు చేసిన హీరో గా రికార్డు సృష్టించాడు.తర్వాత తన సొంత
స్టూడియో లో………………….
                                                                    “ఈనాడు ” అనే సినిమా తీసి పెద్దసహసమే చేసాడు. ఇది అతను ap లో అప్పటి రాజకీయం పరిపాలనలపై గట్టి
ప్రభావం చూపింది.
                                                    1983 తీసిన…………
                                                                     “ముందడుగు”,
                                                                        “కిరాయి కోటిగాడు”,
                                                                      “అడవి సింహాలు”,
                                                                           “శక్తి”
                                                                          “ప్రజారాజ్యం”……………… సినిమాలు అతన్ని no 1 స్తానంలో నిలిచేలా చేసారు. తర్వాతి ఏడాది కూడా కృష్ణ తన
జైత్రయాత్ర లో…………..
                                                                     “ఇద్దరు దొంగలు “,”బంగారు కాపురం”, “ముఖ్యమంత్రి” మరియు ……………………..
                                                               “కంచుకాగడ”…………………….. అనే తిరుగులేని విజయాలను సాదించాడు. అందులో “కంచుకాగడ” మొదటి వారంలోనే
82 లక్షలు వసూలు చేసి చరిత్ర సృష్టించింది. ఇక ఆ ఏడాది.. ”దొంగలు బాబోయ్ దొంగలు” సినిమాతో ముగించాడు, ఈ సినిమా విజయవాడలో ఒకే హాల్లో
100 రోజులు ఆడింది.  
                                   1985 తన కెరీర్లో భారి విజయాలను చవిచూసాడు, ఈ సంవత్సరమే

                                                               ”అగ్నిపర్వతం”,



                                                          “పల్నాటి సిoహం”………………. మరియు 

                                                              “వజ్రాయుధం”………………………… వంటి సినిమాలతో తన no:1 స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
పరుచూరి బ్రదర్స్ తమ డైలాగ్స్ తో  ఈ విజయాలలో కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాలు ఎంతగా పాపులర్ అయ్యాయంటే ఎన్నో అభిమాన
సంఘాలు ఈ సిన్మా పేరునే తమ సంఘం పేరుగా మార్చుకున్నాయి.
ఇదే ఏడాది  కృష్ణ ……………
              
“సూర్య చంద్ర “, “పచ్చని కాపురం ” మరియు “మహాసంగ్రామం “అనే సినిమాలలో కూడా నటించాడు. “మహాసంగ్రామం” సినిమా  శోభన్ బాబుతో చేసాడు.
1986 లో కృష్ణ చేసిన “కృష్ణ గారడీ” మరియు “బ్రహ్మాస్త్రం ” సినిమాలు అభిమానులను నిరాశ పరిచాయి. ఆ తర్వాతి ఏడాదే కృష్ణ కోటి
రూపాయల భారి బడ్జట్ తో  “సింహాసనం” సినిమా తీసాడు. అది విడుదలైన తొలి వారం లోనే కోటి యాభయ్ లక్షలు వసూళ్లు చేసింది. ఒక్క ఆంద్ర ప్రదేశ్ లోనే
150 సినిమా హాల్లో విడుదల అయ్యింది. ఆంధ్రాలోని ప్రధాన పట్టణాలలో అది శతదినోత్సవాలు జరుపుకుంది.
“ఖైది  రుద్రయ్య” సినిమాకూడా సంగీత పరంగా చాలా రికార్డులని సృష్టించింది. తర్వాత తెలుగు దేశం పార్టీ ని  ఉద్దేశించి “పిలుపే ప్రభంజనం” అనే సినిమా తీసాడు
దీనిని చాలా చోట్ల ఆ పార్టీ కార్యకర్తలు ఆపాలని చూసారు కానీ వారి గొడవ వల్ల ఈ సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ వచ్చి సినిమా విజయం సాధించింది.
తర్వాత కృష్ణ తీసిన “ముద్దాయి” అనేక రికార్డులను సృష్టించింది.  తర్వాత దొంగోడొచ్చాడు  మరియు “తండ్రి  కొడుకుల చాలంజ్ ” సినిమాలతో విజయం
సాధించాడు కానీ 1987  అతనికి అసలు కలిసి రాలేదనే చెప్పాలి , ఆ సంవత్సరం కృష్ణ భారి అంచనాలతో వ్డుదల చేసిన “సర్దార్ కృష్ణమ నాయుడు ”,
విశ్వనాధ నాయకుడు ”, “మా ఊరి మగాడు ” మరియు ” మకుటంలేని మహారాజు ” వరుసగా  ఫ్లాప్ అయినా కృష్ణ పెద్ద కొడుకు హీరో గా సినీరంగంలోకి
అడుగు పెట్టాడు. రమేష్ బాబు (కృష్ణ పెద్ద కొడుకు ) ఇదే ఏడాది అక్టోబర్ 2 న సామ్రాట్ అనే సినిమాతో హీరో గా మారాడు.
1988 ఆటను తీసిన “కలియుగ కర్ణుడు”, “అశ్వద్ధామ”, “రౌడి no :1″ మరియు “ముగ్గురు కొడుకులు”   బాక్స్ ఆఫీసు వద్ద పరవాలేదని పించాయి.
తర్వాతి ఏడాది కృష్ణ “కొడుకు దిద్దిన కాపురం”, “సాహసమే నా ఊపిరి “, “గూడచారి 117″ మరియు “గూండారాజ్యం” సినిమాలు అనే సూపర్ హిట్
సినిమాలలో నటించాడు. వీటిలో గూండారాజ్యం మొదటి వారమే 74 లక్షలు వసూలు చేసి రికార్డులు సృష్టించింది.ఇదే  సమయంలో Eluru (W.G.)       
నుండి మెంబర్ అఫ్ పార్లమెంట్ గా ఎన్నికయ్యాడు.

You are receiving this email because you subscribed to this feed at blogtrottr.com.

If you no longer wish to receive these emails, you can unsubscribe from this feed, or manage all your subscriptions

No comments:

Post a Comment

Blog Archive