NTR Auto Biography and Filmography

పద్మశ్రీ నందమూరి తారక రామారావు
పుట్టినతేది: 28 మే 1923
NTR చిన్నప్పటి ఫోటో

NTR ఫ్యామిలీ ఫోటో

NTR తల్లితండ్రులు : నందమూరి లక్ష్మయ్య చౌదరి

NTR భార్య : బసవ తారకం (వివాహం జరిగినది 1942)

కుమారులు : స్వర్గీయ్య రామకృష్ణ, జయకృష్ణ, హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, సాయికృష్ణ, జూ.రామకృష్ణ, జయశంకర్ కృష్ణ

కుమార్తెలు : శ్రీమతి ఉమా మహేశ్వరి, శ్రీమతి భువనేశ్వరి, శ్రీమతి లోకేశ్వరి, శ్రీమతి పురందరేశ్వరి.

నటునిగా, ప్రజా నాయకునిగా కోట్లమంది ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని ఆక్రమించుకున్న స్వర్గీయ్య నందమూరి తారక రామారావు తన నటనతో రాజకీయ సామర్ధ్యంతో తెలుగువాడి గొప్పతనాన్ని ప్రపంచపు నలుదిశలా వ్యాపింపజేశారు. కృష్ణాజిల్లాలోని నిమ్మకూరు గ్రామంలో జన్మించారు.
NTR చిన్నప్పటి ఫోటో

బాల్యంలోనే సంస్కృతశ్లోకాలు, పద్యాలూ, పెద్దబాలశిక్ష అవపాసన పట్టి, సాంప్రదాయక అలవాట్లను నేర్చుకున్నారు. విజయవాడలోను, గుంటూరు లోను విద్యాబ్యాసం కొనసాగించారు. తరవాత కొంతకాలం విజయవాడలో ఉద్యోగ భాద్యతలు కొనసాగించారు. చదువుకునే సమయంలోనే నాటకాలు వేస్తూ నటనలో ప్రాదమిక శిక్షణ పొందారు. నటన మీద ఆసక్తితో సోదరుడు త్రివిక్రమరావుతో కలసి ‘నేషనల్ ఆర్ట్ దియేటర్’ పేరిట సంస్థను స్థాపించి నాటకలు ప్రదర్శించేవారు. ఆక్రమంలో అప్పటి దర్శక నిర్మాతలు పుల్లయ్య, గూడవల్లి రామబ్రహ్మం గార్ల దృష్టిని ఆకర్షించిన యన్.టి.ఆర్ ‘మనదేశం’ చలనచిత్రం ద్వారా సిని రంగప్రవేశం చేసారు. అప్పటి నుంచి రాముడిగా, కృష్ణుడిగా మొదలుకుని పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వివిధపాత్రలలో జీవిస్తూ 320 చిత్రాలలోనటించి తెలుగు సినిమాకు వన్నె తగ్గని కీర్తిని సంపాయించిపెట్టారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు సినిమా చరిత్రలో తిరుగులేని కధానాయకుడిగా నిలిచిపోయారు.
NTR నేషనల్ అవార్డు అనేది ప్రముఖ దేశీయ అవార్డులలో ఒకటిగా ఆంద్ర ప్రదేశ్ గవర్నమెంట్ చే గుర్తించబడినది. ఇది సిని రంగంలో విశిష్ట సేవలందించిన వారికీ గౌరవ ప్రదంగా ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం అందజేస్తోంది. ఈ అవార్డు తో పాటుగా 5 ,00,000/- రూపాయలు ఇవ్వటం జరుగుతోంది. ఈ అవార్డు 1996 నుండి ప్రకటించడమైనది .
N T రామా రావు ఫిల్మోగ్రఫీ
1949 మన దేశం పోలీసు ఆఫీసర్ NTR మొదటి సినిమా
1950 పల్లెటూరి పిల్ల జయంత్ NTR హీరో గా మొదటి సినిమా
1951 పాతాళ భైరవి తోట రాముడు
1952 పెళ్లి చేసి చూడు రమణ
1956 తెనాలి రామకృష్ణ శ్రీ కృష్ణ దేవ రాయ
1957 వినాయక చవితి లార్డ్ కృష్ణ
పాండురంగ మహత్యం పున్దరికుడు
1959 రాజమకుటం ప్రిన్సు ప్రతాప్
1960 భట్టి విక్రమార్క విక్రమార్క మహారాజు
శ్రీ వెంకటేశ్వర మహత్యం శ్రీ మహా విష్ణు / శ్రీనివాసా
1961 జగదేక వీరుని కథ యువరాజు ప్రతాప్
1962 శ్రీ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథ యువరాజు వల్లభాదేవుడు
1962 శ్రీ కృష్ణార్జున యుద్ధం లార్డ్ కృష్ణ
1964 రాముడు భీముడు రాముడు & భీముడు
1966 శ్రీ కృష్ణ పాండవీయం దుర్యోధన / కృష్ణ
శ్రీ కృష్ణావతారం లార్డ్ కృష్ణ
1970 కోడలు దిద్దిన కాపురం
1971 శ్రీ కృష్ణ సత్య లార్డ్ కృష్ణ
1972 బడి పంతులు రాఘవ రావు Filmfare బెస్ట్ యాక్టర్ అవార్డు ( తెలుగు )
1973 దేవుడు చేసిన మనుషులు
దాన వీర శూర కర్ణ కర్ణ , దుర్యోధన మరియు కృష్ణ
1980 సర్దార్ పాపారాయుడు సర్దార్ పాపారాయుడు & గోపి
1984 శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర NTR ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.
1993 మేజర్ చంద్రకాంత్ చంద్రకాంత్
1970 – తెలుగు లో ఉత్తమ డైరెక్టర్ గా వరకట్నం సినిమాకి Filmfare అవార్డ్స్ సౌత్
1972 — తెలుగు ఉత్తమ నటునిగా బడి పంతులు
1968 — పద్మశ్రీ అవార్డు ( గవర్నమెంట్ అఫ్ ఇండియా )
1978 — గౌరవ డాక్టరేట్ ( ఆంధ్ర యునివర్సిటీ )
ఎన్టీఆర్ విశిష్టత :
సిసలైన ప్రజానాయకుడు ఎన్టీఆర్. ఆంధ్ర ప్రదేశ్ లో, ఆయన సమకాలికుల్లో ఆయనంతటి ప్రజానాయకుడు మరొకరు లేరు.
వటవృక్షంలాంటి కాంగ్రెసు పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ లో దీటైన ప్రత్యామ్నాయాన్ని నిలబెట్టిన గొప్పదనం పూర్తిగా ఎన్టీఆర్‌దే.
పట్టుదలకూ, క్రమశిక్షణకు మారుపేరైన వ్యక్తి ఆయన. ఈ కారణాలవల్లనే కాంగ్రెసు పార్టీని ఎదుర్కొని స్థిరమైన ప్రభుత్వాన్నీ, ప్రభావవంతమైన ప్రతిపక్షాన్ని రాష్ట్ర ప్రజలకు ఇవ్వగలిగారు.
తెలుగుజాతికీ, తెలుగుభాషకూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్.
స్త్రీలకు ఆస్తిలో వాటా ఉండాలని చట్టం తెచ్చిన ఘనత రామారావుదే.
బలహీన వర్గాలకు లక్షలాదిగా ఇళ్ళు కట్టించిన గొప్పతనం ఆయనకు దక్కింది.
రెండు రూపాయలకే కిలో బియ్యం వాగ్దానం చేసి, ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు ఓర్చి, తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారు.
తెలుగుగంగ ప్రాజెక్టులో పట్టుబట్టి రాయలసీమ సాగునీటి అంశాన్ని చేర్చిన ఘనత కూడా ఎన్టీఆర్‌దే.
దేశంలో ప్రధాన ప్రతిపక్షాలను ఒకతాటిపైకి తెచ్చిన నేత ఆయన.
ఎందరో కొత్తవారిని, బాగా చదువుకున్నవారిని రాజకీయాలకు పరిచయం చేసి, ఒంటిచేత్తో వారిని గెలిపించిన ప్రజానాయకుడు ఆయన. దేవేందర్ గౌడ్, కె.చంద్రశేఖరరావు మొదలైన నేతలు ఆయన పరిచయం చేసినవారే.
"నక్సలైట్లు కూడా దేశభక్తులే బ్రదర్" అంటూ సమర్థించటం ఒక విశేషం.
మదరాసులో ఆయన వుండగా తిరుపతి వెళ్ళిన తెలుగు యాత్రీకులు మొక్కుబడిగా మదరాసు వెళ్ళి ఆయనను దర్శించుకుని వచ్చేవారు.
కొన్ని సాహసోపేత నిర్ణయాలు: మహిళలకు ఆస్తి హక్కు, వెనుకబడినకులాల వారికి రిజర్వేషన్లు, పురోహితులుగా ఎవరైనా ఉండవచ్చుననే అంశం
రామారావుగారికి బాబాల, మాతల పిచ్చి లేదు. దేవునిపట్ల భక్తి ఉన్నది. బుద్ధునిపట్ల అపార గౌరవమున్నది.
ముఖ్యమంత్రి కాగానే సుప్రసిద్ధ జర్నలిస్టు, ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు గారిని సాంస్కృతిక సలహాదారుగా వేసుకున్నారు.
రామారావూ గారి నాయకత్వన జరిగిన కర్యక్రమాల జాబిత: ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ అప్పటిదాకా రెడ్డి కులం వారికి మాత్రమే అన్ని రాజకీయ పదవులను కట్టబెట్టడంతో ,ఎన్టీఆర్ మిగతా కులముల వారికి ఆశాకిరణం లాగ కనిపించారు ఎన్టీఆర్ మొట్ట మొదటి సారిగా అన్ని కులముల వారికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలవారి కి తెలుగుదేశం పార్టీ లో ఉన్నత పదవులు కల్పించారు అయన చేసిన కృషి ఫలితంగా ఈనాటికి బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీ కి అండగా ఉన్నారు.
తెలంగాణా లో బడుగు బలహీనవర్గాలని పట్టి పీడుస్తున్న పటేల్ పట్వారి వ్యవస్థ లని రద్దు చేసి తెలంగాణా లో ని బడుగు బలహీన వర్గాలకి ఆరాధ్యదైవంగా మారినారు.
ఎన్టీఆర్ పై విమర్శలు :
ఏకస్వామ్య పరిపాలన
వ్యక్తుల గురించి, రాజకీయ పార్టీల గురించి ఆయన వాడిన భాష రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. ఇతర పార్టీలు దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడంతో రాజకీయనేతలు వాడే భాషా స్థాయి మరింత పడిపోయింది.
ఏ ఇతర నేతకూ లభించని ప్రజాదరణ పొందినా కేవలం స్వీయ తప్పిదాల కారణంగా దాన్ని నిలుపుకోలేకపోయారు.
ఆయన పాలనా కాలంలో కులపరమైన ఘర్షణలు జరిగాయి. ఆయనకు ప్రత్యక్ష సంబంధం లేకున్నా, అప్పటి ముఖ్యమంత్రిగా బాధ్యత వహించక తప్పలేదు.
దర్శకునిగా :
శ్రీసీతారామకళ్యాణం(1962)
గులేబకావళికథ(1962)
శ్రీకృష్ణపాండవీయం(1966)
వరకట్నం(1969)
తల్లాపెళ్ళామా(1970)
తాతమ్మకల(1974)
దానవీరశూరకర్ణ(1977)
చాణక్యచంద్రగుప్త(1977)
అక్బర్ సలీమ్ అనార్కలి(1978)
శ్రీరామపట్టాభిషేకం(1978)
శ్రీమద్విరాటపర్వం(1979)
శ్రీతిరుపతివెంకటేశ్వరకల్యాణం(1979)
చండశాసనుడు(1983)
శ్రీమద్విరాటపోతులూరివీరబ్రహ్మేంద్రస్వామిచరిత్ర(1984)
బ్రహ్మర్షివిశ్వామిత్ర(1991)
సామ్రాట్ అశోక(1992)
నిర్మాతగా :
సామ్రాట్ అశోక (1992)
శ్రీనాథకవిసార్వభౌమ (1993)
దానవీరశూరకర్ణ(1977)
రచయితగా :
బిదాయి(1974) (హిందీ)
పుస్తకం ముఖ చిత్రం :
పేరు :NTR, a biography
భాష : ఇంగ్లీష్
రచయిత :ఎస్.వెంకట్ నారాయణ్
పబ్లిషర్ :వికాస్,న్యూ ఢిల్లీ
సంవత్సరం : 1983
పేరు : ఎన్.టి.ఆర్-ది మాన్ అఫ్ ది మాస్సేస్
భాష : ఇంగ్లీష్
రచయిత :ఎం.డి. నారాయణ నాయుడు
పబ్లిషర్ :శోభ లత పబ్లిషెర్స్
సంవత్సరం : 1995
డిస్ట్రిబ్యూటర్స్ : బుక్ లింక్స్ కార్పోరేషన్
పేరు : ఒకేఒక్కడు
భాష : తెలుగు
రచయిత: ఇ.వెంకట రావు
1982 లో తెలుగువాడి ఆత్మబిమానానికి జరిగిన అవమానాన్ని ప్రాతిపదికగా తీసుకుని సినీరంగం నుండి రాజకీయ రంగప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీ ని స్థాపించారు. పార్టీ స్థాపించిన 9 నెలలకే ముఖ్యమంత్రిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. 73 సంవత్సరాల జీవన గమనంలోనటుడుగాను, రాజకీయ నాయకుడుగాను ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన శ్రీ రామరావు 1996 జనవరి 18 న గుండెపోటుతో పరమపదించారు.
NTR అరుదైన ఫోటో కలక్షన్









No comments:
Post a Comment